Monday, 16 July 2012

చెలి చూపు

చెక్కిలిపై గిలిగింతలు పెడుతున్న
కురులను సవరిస్తూ
అరమోడ్పు కనులతో చూసిన చూపు
నా హృదయాన్ని తాకింది.

గలగల మాట్లాడుతూ
చిరు కోపంతో చూసిన చూపు
నా చూపును కలవరపరిచింది.

నిన్నే గమనిస్తున్న
నా చూపుని చూసిన
నీ చూపుని చూసి
నా అదరాలపై చిరునవ్వు చిగురించింది.

Tuesday, 6 March 2012

చిరునవ్వు

నీ అదరాలపై మెరిసి
నను తన్మయత్వంలోకి
జార్చి మాయమైనధి.

నాలోని నిస్సహాయతను
తరిమికొట్టిన నీ
చిరునవ్వే చాలు
ఈ పయనానికి....

Thursday, 15 December 2011

ఓ మనోహరి

" జీవితమనే ఈ గమనంలో దేవతలా
తారసపడి, తొలిచూపులోనే ఈ
హృదయమనే కోవెలలో కొలువుండి పోయి
నీ అందెల సవ్వడికి బానిస చేసితివి,
నీ చారెడు కళ్ళతో చూసి నా హృదయ
స్పందనను ఒక రాగంగా మార్చావు,
జూకాలతో మరింత అందాన్ని ఇనుమడింప
చేసుకున్న నీ చెక్కిలిపై దిష్టి చుక్కనై,
నీ కాలికి నే అందెనై ఓ మనోహరి!
నీ నాట్యానికి తాళమే నేనైన వేళ
ఈ ఊపిరి ఆగితే...... "