Thursday, 15 December 2011

ఓ మనోహరి

" జీవితమనే ఈ గమనంలో దేవతలా
తారసపడి, తొలిచూపులోనే ఈ
హృదయమనే కోవెలలో కొలువుండి పోయి
నీ అందెల సవ్వడికి బానిస చేసితివి,
నీ చారెడు కళ్ళతో చూసి నా హృదయ
స్పందనను ఒక రాగంగా మార్చావు,
జూకాలతో మరింత అందాన్ని ఇనుమడింప
చేసుకున్న నీ చెక్కిలిపై దిష్టి చుక్కనై,
నీ కాలికి నే అందెనై ఓ మనోహరి!
నీ నాట్యానికి తాళమే నేనైన వేళ
ఈ ఊపిరి ఆగితే...... "

జుమ్‌కా

" చెక్కిలి ప్రక్కనే ఉండి
చెక్కిలి అందాన్ని ఇనుమడింపజేస్తూ,
అప్పుడప్పుడు డోలలాడుచూ,
కురులకు ఇష్టసఖివై,
కురులతో ఆటలాడుచూ,
ఆడవారి ఇష్టనగవైతివి. "

చెలి

" నీ జ్ఞాపకాల ఒడిలో
నే నిదురించనా....
నీ మమతల గుడిలో
నే కొలువుండనా....
ప్రాణమే నీవుగా,
ధ్యానమే నీదిగా,
నీ కనుపాపల నీడలో
నే ఒదిగి పోనా...."

Wednesday, 14 December 2011

కల

" ఓ కల, అలలాగ చెదిరిపోతావు,
మిలమిలలాడే వర్ణాలను చూపించి,
ఆనందడోలికల్లో తేలిస్తావు,
తేలుతున్నంతలోనే అలలాగ చెదిరిపోతావు,
నీకిది న్యాయమా? "

అమ్మ

" జన్మనిచ్చిన ఒడిలోని ఆ హాయి మధురం,
తొలిగురువై నేర్పిన ఆ పలుకులు మధురం,
వెన్నెల్లో తినిపించిన ఆ గోరుముద్దలు మధురం,
నిదురపుచ్చిన ఆ జోలపాట మధురం,
వెన్నలాంటి ఆ మనస్సు మధురం,
కంటికి రెప్పలా కాపాడే ఆ ప్రేమ మధురం,
ఏమీ ఆశించని ఆ త్యాగం మధురం,
అమ్మ ప్రేమకు నోచుకున్న జీవితం మధురాతి మధురం. "