Thursday, 23 July 2015

వెంటాడే నీ కనులు

వెంటాడే నీ కనులు 
   నను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.

మందలించిన నీ కనులు
   నను మైమరిపిస్తున్నాయి.

చిరునవ్వు చిందిన నీ కనులు 
   నను తన్మయ పరుస్తున్నాయి.

గమ్యాన్ని చేరి ఆ కనుల ముందర 
   నిలవాలని ఓ చిన్ని ఆశ.